Mana Indur News
స్థానిక వార్తలు

రైతులకు ఏ దశలోనూ ఇబ్బందులు తలెత్తకూడదు

అదనపు కలెక్టర్ భుజంగరావు

KA
By KARKA RAMESH•September 18, 2026
2
Share
రైతులకు ఏ దశలోనూ ఇబ్బందులు తలెత్తకూడదు

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ, సన్నాహక సమావేశం

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్: .

ఖరీఫ్ లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకితభావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ భుజంగరావు సూచించారు. రైతులు ఏ దశలోనూ ఇబ్బందులు పడకుండా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలని అన్నారు. ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో శుక్రవారం సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను నిర్వహించనున్న నిర్వాహకులతో సన్నాహక సమావేశం, శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి కొనుగోలు కేంద్రంలోనూ రైతులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పంట విక్రయం విషయంలో రైతులు ఇబ్బందులకు గురికాకుండా, పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. సరిపడా సంఖ్యలో తేమ కొలిచే యంత్రాలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా తూకం, తరుగు వంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని, ధాన్యం సేకరణ ముగిసేంత వరకు పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ఏమైనా సమస్యలు గమనించిన వెంటనే వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. సంబంధిత శాఖల అధికారులందరూ సమిష్టిగా, సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. రైతుల నుండి ఏ చిన్న ఫిర్యాదు సైతం రాకుండా చూసుకోవాలని, ధాన్యం సేకరణలో క్షేత్రస్థాయి అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులను అన్ని కేంద్రాలకు సమకూరుస్తామని. అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటదివెంట గోడౌన్లకు తరలించేలా తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్, ఏఎస్ఓ అరవింద్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారిణి గంగుబాయి, తూనికలు కొలతల శాఖ అధికారి షుజాత్ అలీ తదితరులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5