హోన్నాజీపేట్ లో విద్యుత్ షాక్ తో దూడ మృతి
నష్టపరిహారం అందించాలని బిక్కునూర్ యాదగిరి
BI
By BILLA SANTHOSH •September 22, 2026
162

మన ఇందూర్ /ధర్పల్లి:
ధర్పల్లి మండలం హోన్నాజీపేట్ గ్రామంలో మంగళవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తోదూడ మృతి చెందింది. ఉదయం సుమారు 7:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. దూడ యజమాని బిక్కునూర్ యాదగిరి మాట్లాడుతూ, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ప్రమాదానికి కారణాలను పరిశీలించాలని కోరారు. దూడ మృతితో తాను తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయడంతో పాటు నష్టపరిహారం అందించాలని కోరారు.





