Mana Indur News
స్థానిక వార్తలు

నిజామాబాద్‌లో రెండు రోజులు వైన్స్ షాపులు బంద్

25 సాయంత్రం 6 గంటల నుంచి సెప్టెంబర్ 27 ఉదయం 6 గంటల వరకు.

KA
By KARKA RAMESH•September 24, 2026
7
Share
నిజామాబాద్‌లో రెండు రోజులు వైన్స్ షాపులు బంద్

గణేష్ నిమజ్జనం సందర్భంగా  శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం

మన ఇందూర్ / నిజామాబాద్ అర్బన్:

గణేష్ నిమజ్జనం నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలను రెండు రోజుల పాటు మూసివేయాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ 1968 లోని సెక్షన్ 20(1) ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.

ఎక్కడ బంద్?: నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో

ఏవి బంద్?: కల్లు దుకాణాలు, కల్లు డిపోలు, IML షాపులు, 2-B బార్లు, క్లబ్బులు, TD-1 ,  TS BCL షాపులు

బంద్ సమయం: సెప్టెంబర్ 25 సాయంత్రం 6 గంటల నుంచి సెప్టెంబర్ 27 ఉదయం 6 గంటల వరకు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5