రైతంగ సమస్యల పరిష్కారానికి డిప్యూటీ తాహాసీల్దార్ కు వినతి పత్రం
రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలి

మన ఇందూర్ మోపాల్
రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో తేదీ 19- 9-2026న మోపాల్ తాహాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి డిప్యూటీ తహసిల్దార్ కు మెమోరాండం అందజేశారు.అనంతరం AIKMS జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ ..రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారంటీలో భాగంగా మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తానని చెప్పిన నేటికీ దాని అమలుకు పూనుకోలేదు అని అన్నారు. వ్యవసాయ కూలీలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తామన్న 12000 రూపాయలు గత రెండునర సంవత్సరాల నుంచి బకాయిలు ఇవ్వాలని వారు కోరారు. కరువు పరిస్థితులు నెలకొంటున్న ఈ సమయంలో రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు పప్పులు, నూనె, కారం తదితర 14 రకాల నిత్యవసర వస్తువులను అందజేయాలని వారన్నారు. మంచిప్ప 21 ప్యాకేజీ పనులకు తగిన నిధులను కేటాయించి పూర్తి చేయాలని మూతపడిన NCSF సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించాలని దాన్ని బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నడిపించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి బండమీద నరసయ్య,వేల్పూర్ భుజంధర్ కమ్మరి గంగాధర్ శ్రీను, నాగడి సుమన్,రాకేష్ తుంగపల్లి రాజ్ కుమార్, సాయిలు తదితరులు పాల్గొన్నారు






