Mana Indur News
క్రీడలు

క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు రగ్బీ పోటీలు

అస్మిత జిల్లా స్థాయి రగ్బీ టోర్నమెంట్ ఘనంగా నిర్వహణ

KA
By KARKA RAMESH•September 20, 2026
7
Share
క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు రగ్బీ పోటీలు

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్:

క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీయడంతో పాటు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిజామాబాద్‌లో అస్మిత జిల్లా స్థాయి రగ్బీ టోర్నమెంట్ను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ అధ్యక్షత వహించారు. క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ..క్రమశిక్షణతో నిరంతరం సాధన చేస్తే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని సూచించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దన్‌పాల్ సూర్య నారాయణ గారు హాజరై క్రీడాకారులను అభినందించారు. క్రీడల్లో యువత మరింతగా రాణించాలని, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగి నిజామాబాద్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

జి జి కాలేజ్ ప్రిన్సిపాల్ రామ్ మోహన్ రావు మాట్లాడుతూ.. తమ కళాశాల మైదానాన్ని జిల్లా స్థాయి రగ్బీ టోర్నమెంట్ నిర్వహణకు ఎంపిక చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. టోర్నమెంట్‌ను చక్కగా నిర్వహించిన నిర్వాహకులను అభినందిస్తూ, క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడం, క్రీడలు సక్రమంగా నిర్వహించబడటం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా క్రీడలకు, క్రీడాకారులకు తమ కళాశాల తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.

పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు, జట్లకు నిర్వాహకులు అభినందనలు తెలిపారు. టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన కోచ్‌లు, అధికారులు, నిర్వాహకులు, క్రీడాకారులు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5