Mana Indur News
స్థానిక వార్తలు

విజేతలకు బహుమతులు ప్రదానం

పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత పై డ్రాయింగ్

KA
By KARKA RAMESH•September 18, 2026
1
Share
విజేతలకు బహుమతులు ప్రదానం

మన ఇందూర్ మోపాల్

మోపాల్ మండల కేంద్రంలోని లిటిల్ హార్ట్స్ గణేష్ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత పై ఇటీవల డ్రాయింగ్ ఛాలెంజ్ పాల్గొన్న వారికి బహుమతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా పిల్లల్లో ఉన్న ప్రతిభను నైపుణ్యం గుర్తించి వారిని అభినందించాలని ఉద్దేశం తో మోపాల్ లో గణపతి ఉత్సవాలు (నిమర్జనం ) సందర్భంగా లిటిల్ హార్ట్స్ గణేష్ మండలి మట్టి గణపతి ఆధ్వర్యంలో డ్రాయింగ్ ఛాలెంజ్ లో పాల్గొన్న అశ్విత, అక్షర ఆకృతి, అన్వేష్, అద్వైత్ హరిణి ,వర్ష, దీక్షిత్ ,యశ్వంత్, హరిణి ,వర్ష, దీక్షిత్, తదితరులకు గెలుపొందిన 15 మంది పిల్లలకు ఉపయోగపడే విధంగా సర్టిఫికెట్స్ ఫైల్స్ బహుమతిగా ఇవ్వడం జరిగింది.. ఈ బహుమతులను గ్రామ సర్పంచ్ ద్యాప రవి కుమార్ వార్డు సభ్యులు సంతోష్ రెడ్డి,సతీష్, అనిత గార్లు పిల్లలకు బహుమతులు అందజేశారు.. పిల్లల ప్రతిభను చూసి గణేష్ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు అభినందించారు.. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు నవీన్ రెడ్డి ,కిషన్ ముతేన్న ,జీవన్,భూమారెడ్డి ,గంగాధర్ నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు..

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5