Mana Indur News
స్థానిక వార్తలు

ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతానికి తోడ్పాటును అందించాలి

రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి

KA
By KARKA RAMESH•November 13, 2026
2
Share
ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతానికి తోడ్పాటును అందించాలి

ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతానికి తోడ్పాటును అందించాలి

రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి

మన ఇందూర్ న్యూస్/ నిజామాబాద్:

తుది దశకుఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతానికి చేరిందని, ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యేందుకు రాజకీయ పార్టీలు తోడ్పాటును అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఐడీఓసీలో శుక్రవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించి, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న చర్యలు, తదుపరి కార్యాచరణ గురించి వివరించారు. ఈ 26వ తేదీ వరకు అభ్యంతరాలను పరిష్కరించడం జరుగుతుందని, నవంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రచురణ అవుతుందని తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో అబ్సెంట్, షిఫ్ట్, డెత్, డూప్లికేషన్ (ఏ.ఎస్.డీ.డీ) కారణాలతో పేర్లను తొలగించబడిన వారికి ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం మరోమారు అవకాశం కల్పించబడుతోందని కలెక్టర్ తెలిపారు. ఏ.ఎస్.డీ.డీ జాబితాలో ఉన్న వారికి తాజాగా ఎన్యూమరేషన్ ఫారం తో పాటు అనేగ్జర్ - బి, అనేగ్జర్ - సి లను అందించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కేంద్రాల వారీగా బీ.ఎల్.ఓలు ఇళ్లకు వెళ్లి వారికి అందించేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు. ఈ ప్రక్రియకు ఆయా రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగించబడకూడదనే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఏ.ఎస్.డీ.డీ జాబితాలో ఉన్న వారి విషయంలో మరోమారు అవకాశం కల్పిస్తోందని అన్నారు. ఎక్కడైనా అర్హులైన వారి పేరు పొరపాటుగా తొలగించబడితే, ఈ ప్రక్రియ ద్వారా తుది జాబితాలో చేర్చడం జరుగుతుందన్నారు. ఆబ్సెంట్, షిఫ్ట్, డూప్లికేషన్ జాబితాలో ఉన్న వారిని వ్యక్తిగతంగా, ఎస్.ఎం.ఎస్ లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5