సంక్షేమ పథకాలు నేరుగా అందేలా స్మార్ట్ కార్డులు
"మెంట్రాజ్ పల్లి గ్రామం లో గ్రామ సర్పంచ్ ఎడ్ల ప్రవళిక స్మార్ట్ కార్డులు పంపిణీ"
నా
By నాయిడి ప్రభాకర్.•September 22, 2026
8

మన ఇందూర్ /డిచ్ పల్లి :
సంక్షేమ పథకాలు నేరుగా అందేలా ఈ కార్డులను ప్రభుత్వం రూపొందించడం జరిగిందని సర్పంచ్ ఎడ్ల ప్రవళిక అన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం మెంట్రాజ్ పల్లి గ్రామం లో స్మార్ట్ కార్డులు పంపిణీ సర్పంచ్ ఎడ్ల ప్రవళిక పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..నకిలీ పేర్లను తొలగించి, నిజమైన పేదలకు సంక్షేమ పథకాలు నేరుగా అందేలా ఈ కార్డులను రూపొందించారన్నారు. దేశంలో లో రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఈ స్మార్ట్ కార్డు ద్వారా రేషన్ సరుకులు పొందే సౌకర్యం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.






