Mana Indur News
స్థానిక వార్తలు

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి

సెప్టెంబర్ 17 న నాంపల్లి గ్రౌండ్స్ లో జరిగే సిపిఐ బహిరంగ సభను జయప్రదం చేయండి

MI
By Mana Indur News•September 15, 2026
14
Share
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్ :

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ అన్నారు. సెప్టెంబర్ 17 న నాంపల్లి గ్రౌండ్స్ లో జరిగే సిపిఐ బహిరంగ సభను జయప్రదం చేయలని కోరారు. మంగళవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సిపిఐ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన రోజు సెప్టెంబరు 11 ఆరోజు నుండి సెప్టెంబర్ 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను సిపిఐ శాఖలలో నిర్వహించడం జరిగిందని, చివరి రోజైన సెప్టెంబర్ 17న జరుగు సాయుధ పోరాట ముగింపు బహిరంగ సభ హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్నందున ఈ బహిరంగ సభకు హాజరు కావాల్సిందిగా పార్టీ నాయకత్వాన్ని, ప్రజలను కోరుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినాన్ని అధికారికంగా జరుపుతూన్నప్పటికీ ఈ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరుతున్నామన్నారు. ఈ ప్రెస్ మీట్ లో సిపిఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.ఓమయ్య, సిపిఐ జిల్లా నాయకులు పి.హనుమాన్లు,ప్రసాద్, గోవర్ధన్, రాధా కుమార్ పాల్గొన్నారు

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5