మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం
37వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి టెంట్ హౌస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ.

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్:
మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్దామని నగర మేయర్ కూరగాయల ఉమారాణి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాట్ పల్లి నగేష్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఆదివారం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని 37వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి టెంట్ హౌస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ కూరగాయల ఉమారాణి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాట్ పల్లి నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, స్థానిక కార్పొరేటర్ ఎర్రం గంగాధర్ విచ్చేసి మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ ఉమారాణి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణహితం కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలన్నారు. పిఓపి గణపతి వల్ల పర్యవారానికి హాని జరుగుతుందన్నారు. చెరువులు కుంటలు వాగులు వంకలను కలుషితం చేస్తే ఆ నీటి ద్వారా ఎన్నో వ్యాధులు ప్రబలి అవకాశము ఉందన్నారు. పెద్ద పెద్ద విగ్రహాలు, హంగు ఆర్భాటాలు లేకుండా అందరూ ఒకే చోటుకు వచ్చేలా బాలగంగాధర్ తిలక్ ఆలోచన మేరకు గల్లీకో గణపతి ప్రతిష్టించి, అందరూ భక్తిశ్రద్ధలతో ఒకే చోట పండగ వాతావరణం లో పూజలు నిర్వహించాలన్నారు. ఈ మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమంలో కో -ఆప్షన్ సభ్యులు బొబ్బిలి మురళి, స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






