Mana Indur News
స్థానిక వార్తలు

జాతీయ మహాసభల విజయవంతానికై బైక్ ర్యాలీ

కరపత్రాలు పంపిణీ.

KA
By KARKA RAMESH•September 19, 2026
1
Share
జాతీయ మహాసభల విజయవంతానికై బైక్ ర్యాలీ

మన ఇందూర్ మోపాల్:

అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జాతీయ 4వ మహాసభను సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో ఖమ్మం పట్టణంలో జరిగే సభలను విజయవంతం చేయాలని ఏఐకేఎంఎస్ మోపాల్ మండల కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మోపాల్,తాడేం, నర్సింగ్ పల్లి, సిర్పూర్ గ్రామాలలో బైక్ ర్యాలీ ద్వారా విస్తృతంగా కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించామిని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి బండమీద నరసయ్య మాట్లాడుతూ భారత ప్రభుత్వం అమెరికా యూరోపియన్ దేశాలతో చేసుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక చర్యలు చేపడుతున్నారని అన్నారు. రైతాంగ అప్పులను మాఫీ చెయ్యని మోదీ ప్రభుత్వం కార్పొరేటర్ల సంపన్న వర్గాలు చెల్లించాల్సిన 18 లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేసిందని వారన్నారు. మోడీ కార్పొరేటర్ల కబంధహస్తలో ఉండి వారి సేవకి అంకితమయ్యారని అన్నారు. ఇప్పటికైనా రైతులను కాపాడుకునే విధంగా వారి చర్యలుండాలని, వ్యవసాయా అభివృద్ధికై వారి విధానాలు ఉండాలని వారన్నారు. ఖమ్మంలో జరిగే మహాసభల విజయవంతనికై ప్రజలు,రైతులు రైతు కార్మికులు అధిక సంఖ్యలో హాజరవ్వాలని వారు కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి బండమీద నర్సయ్య, వేల్పూర్ భూజేంధర్ కమ్మరి గంగాధర్, తుంగపల్లి రాజ్ కుమార్, సాయిలు, నాగడి సుమన్ తదితరులు పాల్గొన్నారు

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5