జానపద కళాకారులకు ఆడిషన్స్
కనుమరుగవుతున్న జానపద కళలు, జానపద గేయాలను పరిరక్షించి భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో.. దూరదర్శన్

మన ఇందూర్ / నిజామాబాద్ అర్బన్:
కనుమరుగవుతున్న జానపద కళలు, జానపద గేయాలను పరిరక్షించి భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో దూరదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మన ఊరు–మన పాట’ ఆటపాట ఆడిషన్స్ సీజన్-4 ఈ నెల 29న నిర్వహించనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కవిత కాంప్లెక్స్‌లో ఉన్న ఎస్‌ఎస్‌ఆర్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి ఆడిషన్స్ ప్రారంభమవుతాయి.
18 నుంచి 40 ఏళ్ల వయస్సు గల స్త్రీ, పురుషులు ఈ ఆడిషన్స్‌లో పాల్గొనవచ్చు. ప్రతిభకు ప్రాధాన్యం ఇచ్చే ఈ కార్యక్రమానికి దూరదర్శన్ సిబ్బంది స్వయంగా హాజరై కళాకారుల ప్రతిభను పరిశీలించనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని జానపద కళాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జానపద కళాకారుడు మరిపల్లి స్వామి గౌడ్ కోరారు. ఆయన పర్యవేక్షణలో ఆడిషన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు 9948957678 నంబరులో సంప్రదించవచ్చు.
#జనపదం
#జానపద కళాకారులకు ఆడిషన్స్






