Mana Indur News
స్థానిక వార్తలు

నవీ పెట్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించాలి. .

సెప్టెంబర్ 26 జయంతి ఐలమ్మ విగ్రహం వద్దనే జరగాలి. గ్రామ పెద్దలు ఎమ్మెల్యే చొరవ చూపాలి.

MI
By Mana Indur News•September 24, 2026
7
Share
నవీ పెట్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించాలి. .

నవీ పెట్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించాలి. .

మన ఇందూర్ /నవీపెట్.

నవీపేట్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ముసుగు వేసి
ఉంచడం సరికాదని సెప్టెంబర్ 26 ఐలమ్మ జయంతి రోజు విగ్రహాన్ని ఆవిష్కరించాలని సిపిఐ మహిళ సంఘం జిల్లా కార్యదర్శి మంద స్వరూప రాణి కోరారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తెలంగాణ ముద్దుబిడ్డ, బీసీ లకు మార్గదర్శకం అయిన నాయకురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని అన్ని ప్రజా సంఘాలు,  అన్ని రాజకీయ పార్టీలు, యువత ముందుకు వచ్చి విగ్రహ ఆవిష్కరణకు సహకరించాలన్నారు. విగ్రహం ఏర్పాటు ఎవరికి ఇబ్బంది కలిగించడం లేనందున, మండల కేంద్రంలో ఏర్పాటును ఎవ్వరు అభ్యంతరం చెప్పవద్దని విజ్ఞప్తి చేశారు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన మహిళా మూర్తి విగ్రహం నవీపేట్ మండల కేంద్రంలో తప్పక ఆవిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. 26 జయంతి నాటికి ఆవిష్కరించేలా గ్రామ పెద్దలు, స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపాలన్నారు. చాకలి ఐలమ్మ విగ్రహం ఆవిష్కరిస్తే ఆమె వీర చరిత్ర మండలప్రజలకు మరింత తెలుస్తుందన్నారు.

#చాకలి ఐలమ్మ

#నవీపేట్

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5