Mana Indur News
కల్చరల్

కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇవ్వాలి.

తెలంగాణ ఉద్యమ నాయకుడు కార్య దీక్షా పరుడు గొప్ప ఉద్యమ నేత బిసి ముద్దుబిడ్డ అయిన కొండా లక్ష్మణ్

KA
By KARKA RAMESH•September 27, 2026
8
Share
కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇవ్వాలి.

మన ఇందూర్ న్యూస్/నిజామాబాద్ అర్బన్

కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇవ్వాలి. కొండ లక్ష్మణ్ బాపూజీ జీవిత గాథను భారతదేశంలోని ప్రతి పాఠశాలలో ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి* తెలంగాణ ఉద్యమ నాయకుడు కార్య దీక్షా పరుడు గొప్ప ఉద్యమ నేత బిసి ముద్దుబిడ్డ అయిన కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క 111వ జయంతి సందర్బంగా ఘన నివాళులు. స్థానిక వినాయక నగర్లోని హనుమాన్ జంక్షన్ మహనీయుల పార్కులో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు. కొండా లక్ష్మణ్ బాపుజీ యొక్క జీవిత చరిత్ర కేవలం తెలంగాణకు పరిమితం కాకూడదని భారతదేశంలోని ప్రతి ఒక్కరికి తెలవాలి అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుంటే ఎటువంటి కఠిన లక్ష్యాలను కూడా ఛేదించే ధైర్యం వస్తుందని నరాల సుధాకర్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాట పటిమ మరో మహాత్మా గాంధీని తలపిస్తుందని అన్నారు. ఈ సందర్భంలో కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కొరకు చేసిన త్యాగాలను గుర్తు చేయడం జరిగింది. ఒక శాసనసభ్యుడిగా, శాసనసభ ఉపనేతగా, మంత్రిగా, ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలందించి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసి, తెలంగాణ వచ్చిన తర్వాతనే పదవులు తీసుకుంటానని శపథం చేసిన గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. తొంభై ఏళ్ల వయసులో కూడా విశ్రాంతి తీసుకోకుండా బస్సు యాత్ర చేసి యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ ఉద్యమ పాఠాలు నేర్పిన గొప్ప నాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఆనాడు స్వాతంత్రోద్యమంలో కానీ తెలంగాణ తొలి ఉద్యమంలో మరియు తెలంగాణ మలిదశ ఉద్యమంలో కానీ పాలు పంచుకుని ముందు వరుసలో ఉండి ఉద్యమాన్ని నడిపిన గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. తన ఇంటిని తెలంగాణ ఉద్యమాలకు పుట్టినిల్లుగా మార్చి ఎందరికో వేదికగా తన ఇంటిని మార్చిన గొప్ప మార్గదర్శి కొండాలక్ష్మణ్ బాపూజీ. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, దర్శనం దేవేందర్, కరిపె రవిందర్, కొయ్యాడ శంకర్, నారాయణరెడ్డి, చంద్రకాంత్, కోడూరి స్వామి, గంగాధర్, బాలన్న, దారం భూమన్న, అంకం రావు తదితరులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5