తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాల బహిరంగసభకు నిజామాబాద్ కామ్రేడ్స్
CPI జిల్లా కార్యదర్శి పి.సుధాకర్

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాల బహిరంగసభకు నిజామాబాద్ సిపిఐ నాయకులు బయలుదేరినట్లు CPI జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ తెలిపారు. గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతున్న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట విలీన దినోత్సవాల ముగింపు సభ కు హాజరు అవుతున్నామన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, మాతృభూమి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది సిపిఐ కార్యకర్తలు ప్రాణ త్యాగం చేశారన్నారు. వారి త్యాగ ఫలితమే ఆనాడు తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగిందని ఈ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడం కోసం పాఠ్య పుస్తకాలలో చేర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు బి.రఘురాం,అలీ ఇమ్రాన్, సక్కి సురేష్, ఫిరోజ్, సుబోద్,రాధా కుమార్, కిషోర్, వెంకటేష్,సాయి, వంశీ పాల్గొన్నారు.






