Mana Indur News
స్థానిక వార్తలు

వ్యవసాయ పనులకు వెళ్లి వస్తుండగా పిడుగు పాటుకు ఇంటర్ విద్యార్థి మృతి

ఇందల్ వాయి మండలం దేవి తాండలో విషాదం

S
By S Jithendhar •September 20, 2026
21
Share
వ్యవసాయ పనులకు వెళ్లి వస్తుండగా పిడుగు పాటుకు ఇంటర్ విద్యార్థి మృతి

మన ఇందూర్ నిజామాబాద్ రూరల్

సెలవు రోజుల్లో
వ్యవసాయ పనులలో కుటుంబానికి ఆసరవుతడనుకొని పొలానికి తీసుకెళ్తే కానరాని లోకానికి వెళ్లాడని తల్లిదండ్రులు విలపించిన సంఘటన ఇందల్వాయి మండలంలో చోటుచేసుకుంది. ఆదివారం ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ జాతీయ రహదారిలోని దేవి తాండ పంచాయతీ పరిధిలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఇందల్వాయి ఎస్ ఐ భూక్య సుమలత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఇందల్ వాయి మండలం దేవి తండాకు చెందిన బాదావత్ శ్రీనివాస్ సంగీత ల కుమారుడు
బాదావత్ చరణ్(18) వ్యవసాయ పనులు నిమిత్తం సొంత పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా మధ్యాహ్న సమయంలో పిడుగు పాటుకు కుప్పకూలి పోయాడు.  ప్రాణాపాయ స్థితిలో ఉన్నా చరణ్ ను హుటాహుటిన జిల్లా ప్రభుత్వం ఆసుపత్రికి తరలించే క్రమంలోనే మృతి చెందినట్లు మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని  ఎస్ ఐ సుమలత తెలిపారు. మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మార్చూరికి తరలించామన్నారు.

దేవి తాండ లో విషాదం
కాగా చరణ్ డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ ప్రభుత్వం కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. చేతికొచ్చిన కుమారుడు మృతితో దేవి తాండ లో విషాదం నెలకొంది.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5