Mana Indur News
కల్చరల్

జెండా జాతర ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్ పాల్

జండా బాలాజీని దర్శించుకొని వేంకటేశ్వర స్వామి కృపా కటక్షాలు పొందాలి.

KA
By KARKA RAMESH•September 26, 2026
4
Share
జెండా జాతర ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్ పాల్

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో శనివారం నిర్వహించిన జెండా జాతరలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇందూరులో ఏళ్లుగా జెండా జాతర ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. భాద్రపద మాసంలో వినాయకచవితికి ముందు జెండా జాతర ప్రారంభం అవుతుందన్నారు. జెండా ఆలయం నుంచి శోభాయాత్రగా పులాంగ్ వరకు కొనసాగి, అక్కడ వారం రోజులపాటు ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు దర్శించుకొని వేంకటేశ్వర స్వామి కృపా కటక్షాలు పొందాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, పసునూరి రాము, మల్కాయి మహేందర్, ప్రసూన శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5