Mana Indur News
స్థానిక వార్తలు

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో కృషి

తెలంగాణ యూనివర్సిటీ NSUI ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులకు ఘన సన్మానం

Pi
By Pillolla Raju •September 24, 2026
5
Share
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో కృషి

మన ఇందూర్ /డిచ్ పల్లి:

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో కృషి చేస్తున్న రాష్ట్రస్థాయి నాయకులను సన్మానించుకోవడం సంతోషంగా ఉందని యూనివర్సిటీ NSUI అధ్యక్షుడు గూడూరి అరుణ్ తేజ్ తెలిపారు. గురువారంతెలంగాణ యూనివర్సిటీ NSUI ఆధ్వర్యంలో యూనివర్సిటీ క్యాంపస్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో NSUI రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేణు రాజు బట్టు, రాష్ట్ర కార్యదర్శి సుద్దుల గంగా ప్రసాద్లను యూనివర్సిటీ NSUI అధ్యక్షుడు గూడూరి అరుణ్ తేజ్ ఆధ్వర్యంలో శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గూడూరి అరుణ్ తేజ్ మాట్లాడుతూ..విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో కృషి చేస్తున్న NSUI నాయకులను సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టల్ వసతులు, మౌలిక సదుపాయాలు తదితర సమస్యల పరిష్కారం కోసం NSUI నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

NSUI రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేణు రాజు బట్టు, రాష్ట్ర కార్యదర్శి సుద్దుల గంగా ప్రసాద్ మాట్లాడుతూ,..విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు యూనివర్సిటీ NSUI నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని సూచించారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో NSUI తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షుడు గూడూరి అరుణ్ తేజ, జనరల్ సెక్రటరీ జటావత్ రాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కార్తిక్ సిసోడియా, NSUI నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

# NSUI, తెలంగాణ యూనివర్సిటీ

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5