సేవకు మారు బుస్స ఆంజనేయులు పానెల్" ను రెడ్ క్రాస్ ఎన్నికల్లో గెలిపించండి.
పది పదిహేను సంవత్సరాల నుంచి నిస్వార్ధంగా సేవ

సేవకు మరో పేరైన "బుస్స ఆంజనేయులు పానెల్" ను రెడ్ క్రాస్ ఎన్నికల్లో గెలిపించండి.
మన ఇందూర్ న్యూస్ / నిజామాబాద్ అర్బన్
సేవకు మరు పేరైన "బుస్స ఆంజనేయులు పానెల్" ను రెడ్ క్రాస్ ఎన్నికల్లో గెలిపించండని కోరారు. నాలుగవ తేదీ ఆదివారం నాడు రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలు ఉన్నాయి, ఆ సంస్థకు బుస్స ఆంజనేయులు ప్యానెల్ పేరుతో మొత్తం 14 మందిమి పోటీలు చేస్తున్నామని రెడ్ క్రాస్ ప్రస్తుత చైర్మన్ బుస్స ఆంజనేయులు తెలిపారు. తమ ప్యానల్లో మొత్తం 14 మంది రెడ్ క్రాస్ కొరకు గత పది పదిహేను సంవత్సరాల నుంచి నిస్వార్ధంగా సేవ చేస్తున్నామన్నారు. అర్ధరాత్రి అపరాత్రి అయినా కూడా చూడకుండా రక్తం అవసరం ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో స్పందించి వేల ప్రాణాలు కాపాడిన వారేనని తెలిపారు.
"రెడ్ క్రాస్ అంటే కేవలం రక్తదాన సేవలకే పరిమితం కాకుండా తల సేమియా వార్డు, వృద్ధాశ్రమము, డే కేర్ సెంటర్, వివిధ హాస్టల్లో విద్యార్థులకు బ్రాకెట్ల కంపెనీ ఇలా చాలా కార్యక్రమాలు గత పది సంవత్సరాలలో చేసామని బుస్స ఆంజనేయులు గారు అన్నారు.
సమాజానికి వివిధ రూపాల్లో సేవ చేస్తూ రెడ్ క్రాస్ తో రక్తసంబంధం ఉన్న ఈ ప్యానెల్ సభ్యులను గెలిపించి మరొకసారి సేవ చేసే అవకాశం ఇవ్వాలని బుస్స ఆంజనేయులు అన్నారు. మొత్తం 14 మంది గెలిస్తేనే తమ పానెల్ అభ్యర్థి చైర్మన్ అవుతాడని, రెడ్ క్రాస్ ను ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని అన్నారు. తమ పానెల్ సభ్యుల పేర్లు వివరాలను తెలిపారు. 1)ఎ.రవీందర్ 2)బి.ఆంజనేయులు 3)బచ్చబోయిడి గంగ కిషన్ 5)బైరి విజయసాగర్ 7)డి.వెంకటేశం 9)డొల్ల రాజేశ్వర్ రెడ్డి, 11)గున్నల వెంకటేష్ గౌడ్ 13)కరిపే రవీందర్ 16)కుల్కర్ణి రమేష్ బాబు 17)ఎం.శ్రీనివాస్ 21)ఎన్.కృష్ణ 22)నీరడి వెంకటేశ్వర్లు 27)సైదు రమేష్ 28)సుధాకర్ నరాల.
పై సభ్యులందరికీ గెలిపించాలని బుస్స ఆంజనేయులు గారు విన్నపం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బుస్స ఆంజనేయులు గారితో పాటు నరాల సుధాకర్, కరిపే రవీందర్, రమేష్ బాబు, నీరడి వెంకటేశ్వర్లు, బొబ్బిలి కిరణ్, సందేశ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు...






