Mana Indur News
స్థానిక వార్తలు

మంద స్వరూప రాణికి అండగా సిపిఐ.-- సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్

మంద జనార్ధన్, బిజెపి భరత్ రెడ్డిల వల్ల నా కుటుంబానికి ప్రాణహాని..మంద స్వరూప

MI
By Mana Indur News•November 14, 2026
61
Share
మంద స్వరూప రాణికి అండగా సిపిఐ.--  సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్

మంద స్వరూప రాణికి అండగా సిపిఐ.

- పి.సుధాకర్ సిపిఐ జిల్లా కార్యదర్శి

మంద జనార్ధన్, బిజెపి భరత్ రెడ్డిల వల్ల నా కుటుంబానికి ప్రాణహాని ఉంది.

మన ఇందూర్ న్యూస్/ నిజామాబాద్:

మంద స్వరూప రాణికి సిపిఐ అండగా ఉంటుందని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ అన్నారు..మంద జనార్ధన్, బిజెపి నాయకుడు భరత్ రెడ్డిల వల్ల నా కుటుంబానికి ప్రాణహాని ఉందని మంద స్వరూప ఆవేదన వ్యక్తం చేశారు. నవీపేట్ గ్రామానికి చెందిన మంద స్వరూపరాణి భర్త మంద శ్రీనివాస్ శనివారం నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్ లో సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, సిపిఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.ఓమయ్య, సిపిఐ జిల్లా నాయకులు వై.రాజిరెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంద స్వరూప రాణి మాట్లాడుతూ..మాకు ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తి నవీపేట్ లో వ్యవసాయ భూమి మూడు ఎకరాల ఒక గుంట, నవీపేట్ బస్టాండ్ పక్కన ప్రక్కన గల మడిగే కు సంబంధించి 2019లో పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం నవీపేట్ బస్టాండ్ లో ఉన్న రెండు మడిగలు చెరొకటి రావడం జరిగిందన్నారు. మా వాటాకు వచ్చిన మడిగేలో 2019 నుంచి కిరాయికి ఇచ్చుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామన్నారు. మడిగేలో గతంలో ఉన్న బంగారం వ్యాపారి దుర్గా సింగ్ మడిగేను ఖాళీ చేయడంతో టిఫిన్ సెంటర్ వారికి ఇద్దామని మడిగే శుభ్రపరుస్తున్న సమయంలో ఈ మడిగే కూడా నాదేనని 2019లో జరిగిన ఒప్పందం తప్పని మా బావ అయినా మంద జనార్ధన్ నాపై గ్రామపంచాయతీలో దాడి చేయడం జరిగిందన్నారు. మంద జనార్ధన్, బిజెపి భరత్ రెడ్డి ఆయన అనుచరులతో కొత్తగా నాకు సంబంధించిన మడిగే వద్దకు వచ్చి నన్ను బెదిరించడం జరిగిందని, కిరాయికి వచ్చే వారిని బెదిరిస్తూ నన్ను నా భర్త మంద శ్రీనివాస్ ను చంపుతానని బెదిరిస్తున్నారన్నారు. వీరి వల్ల మాకు ప్రాణహాని ఉన్నదని, ఇప్పటికే నవీపేట్ పోలీస్ స్టేషన్ లో నాపై దాడి చేసిన బిజెపి భరత్ రెడ్డి, మంద జనార్ధన్ ల వల్ల మాకు ప్రాణహాని ఉన్నదని, దరఖాస్తు ఇచ్చినప్పటికీ వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, నిజామాబాద్ సిపి సాయి చైతన్య చొరవ చూపి నా కుటుంబానికి న్యాయం చేయాలని, నా కుటుంబ సభ్యులను కాపాడాలని కోరుతున్నామన్నారు.

మంద స్వరూప రాణికి అండగా సిపిఐ- పి.సుధాకర్ సిపిఐ జిల్లా కార్యదర్శి

భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా నాయకురాలు మంద స్వరూప రాణి పై దాడి చేసి, 30 రకాల కేసులు పెట్టి మానసికంగా ఇబ్బంది పెడుతున్న మంద జనార్ధన్ పై చర్యలు తీసుకోవాలన్నారు. ఈమధ్య కాలంలో ఓ మడిగే విషయంలో భయభ్రాంతులకు గురి చేస్తున్న బిజెపి భరత్ రెడ్డి లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, పోలీస్ శాఖను కోరుతున్నామన్నారు. అన్నదమ్ముల మద్యలో జరిగే గొడవలో కలుగజేసుకుని, ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. మంద స్వరూప రాణి న్యాయ పోరాటానికి సిపిఐ అండగా ఉంటుందన్నారు. ఈ విషయంపై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ను కలసి సమస్యను వివరించి, బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5