నిజామాబాద్ అట్టహాసంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం
జండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షుడు బంటు గణేష్..

సార్వజనిక్ గణేష్ మండలి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ,
జండా ఊపి ప్రారంభించిన సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షుడు బంటు గణేష్..
మన ఇందూర్/ నిజామాబాద్ అర్బన్:
వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు, సార్వజనిక్ గణేష్ మండలి ప్రతినిధులు, పుర ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ కూరగాయల ఉమారాణి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్ వి.భుజంగరావు తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 2.00 గంటల సమయంలో దుబ్బ ప్రాంతంలోని సార్వజనిక్ గణేష్ మండలి వద్దకు ప్రజాప్రతినిధులు, అధికారులు చేరుకుని, వినాయక నిమజ్జన శోభాయాత్ర రథం వద్ద కొబ్బరి కాయలు కొట్టారు.ఈ సందర్భంగా సార్వజనిక్ గణేష్ మండలి ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, పుర ప్రముఖులు వీరికి స్వాగతం పలికారు. ఇదే కూడలి వద్ద గల బాలగంగాధర్ తిలక్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షుడు బంటు గణేష్ జెండా ఊపి శోభాయాత్ర రథాన్ని ప్రారంభించారు. అందంగా అలంకరించిన సార్వజనిక్ గణేష్ మండలి శోభాయాత్ర రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణేష్ నిమజ్జనోత్సవాన్ని ఆనందోత్సాహాల నడుమ, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భుజంగరావు కోరారు. శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. వినాయక విగ్రహాలను విసర్జనం చేసే యంచ, ఉమ్మెడతో పాటు అన్ని మండల కేంద్రాలలో అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. నిమజ్జోనోత్సవం సాఫీగా సాగేలా పర్యవేక్షించేందుకు సెక్టోరల్ అధికారులను నియమించామని తెలిపారు. నిమజ్జన ప్రదేశాల వద్ద ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, సరిపడా సంఖ్యలో క్రేన్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామన్నారు. అన్ని శాఖలు పరస్పరం సమన్వయంతో పని చేస్తున్నాయని, బారికేడ్లు, విద్యుత్ దీపాలు వంటి వసతులు నెలకొల్పామన్నారు. కాగా, శోభాయాత్ర సందర్భంగా సుమారు రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. అదనపు కలెక్టర్ వెంట ఆయా శాఖల అధికారులు ఉన్నారు.
#సార్వజనిక్ గణేష్
#నిజామాబాద్ సర్వంజనిక్






