Mana Indur News
స్థానిక వార్తలు

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. భార్య మృతి, భర్తకు తీవ్రగాయాలు

లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు. హాస్టల్లో చదువుతున్న కూతుర్ని చూసేందుకు వెళ్లి అంతలోనే ప్రమాదం.

KA
By KARKA RAMESH•September 12, 2026
25
Share
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.  భార్య మృతి, భర్తకు తీవ్రగాయాలు

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డి వైపు నుంచి ఇందల్ వాయి వస్తున్న బైక్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇందల్వాయి మండలం చంద్రయన్‌పల్లి శివారులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్య అక్కడిక్కడే మృతి చెందగా భర్తకు తీవ్రగాయాలు అయ్యాయి. ఇందల్ వాయి ఎస్‌ఐ సుమలత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బడా భీంగల్ కు చెందిన దుమాల లింబాద్రి (45) ఆయన భార్య దుమాల సుజాత (35)కామారెడ్డి జిల్లా (దోమకొండ) హాస్టల్ లో చదువుతున్న కూతురు ను చూసేందుకు వెళ్ళి కామారెడ్డి నుంచి బడా భీమ్‌గల్ వైపు దంపతులు ద్విచక్ర వాహనం పై తిరిగి వస్తుండగా ఈ క్రమంలో అదే మార్గంలో వెనుక నుంచి వచ్చిన లారీ అదుపుతప్పి వారి బైక్‌ను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో అదుపుతప్పి కిందపడిన సుజాతపై నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఇందల్వాయి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సుజాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. లింబాద్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ సుమలత తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5