జాతీయ ఓబీసీ సమావేశంలో పాల్గొనడం గర్వంగా ఉంది
జాతీయ ఓబీసీ సమావేశంలో పాల్గొన్న నిజామాబాద్ జిల్లా బీసీ నాయకులు..

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్ :
జాతీయ ఓబీసీ సమావేశంలో పాల్గొనడం గర్వంగా ఉందని
బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. ఆదివారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని టూరిజం ప్లాజా హోటల్ లో నిర్వహించిన జాతీయ ఓబీసీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా బీసీ నాయకులు పాల్గొన్నారు.కేంద్రం చేపట్టనున్న జాతీయ కుల గణనలో బీసీ కుల గణన చేయాలనే అంశంతో, బీసీల కు చెందాల్సిన న్యాయపరమైన హక్కుల పైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ ఓబీసీ సమావేశం నిర్వహించగా ఈ కార్యక్రమంలో దేశంలోని ప్రతి రాష్ట్రానికి చెందిన ముఖ్యమైన ఓబీసీ నాయకులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముఖ్య నాయకులు వి. హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, సురేష్ షెట్కర్ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ప్రతినిధి సచిన్ సావంత్, ఓబీసీ జాతీయ చైర్మన్ బబన్ రావ్ తయవాడే తదితరులు పాల్గొన్నారన్నారు. బీసీల హక్కులు సాధించే విధంగా ప్రతి ఒక్కరికి ఈ సమావేశంలో జాతీయ నాయకులు మార్గ నిర్దేశకం చేశారని జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్ తో పాటు దర్శనం దేవేందర్, చంద్రకాంత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు






