Mana Indur News
క్రీడలు

క్రీడలతో క్రమ శిక్షణ, ఆత్మవిశ్వాసం

ఫిట్‌నెస్‌పై యువత ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి బెంచ్‌ప్రెస్‌, డెడ్‌లిఫ్ట్‌ పోటీల్లో బీజేపీ నేత బుస్సాపూర్‌ శంకర్‌

KA
By KARKA RAMESH•September 13, 2026
4
Share
క్రీడలతో క్రమ శిక్షణ, ఆత్మవిశ్వాసం

నిజామాబాద్ అర్బన్ :

యువత చదువు, ఉద్యోగాలతో పాటు క్రీడలు, శారీరక దారుఢ్యంపై దృష్టి సారించాలని బీజేపీ నేత, తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుస్సాపూర్‌ శంకర్‌ సూచించారు. నగరంలోని గుజరాతీ ఫంక్షన్‌హాల్‌లో డీఎస్‌ ఆర్నాల్డ్‌ జిమ్‌ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన బెంచ్‌ప్రెస్‌, డెడ్‌లిఫ్ట్‌ పవర్‌లిఫ్టింగ్‌ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ.. క్రీడలు యువతలో శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలను పెంపొందిస్తాయని అన్నారు. స్థానికంగా ఇటువంటి పోటీలు నిర్వహించడం ద్వారా యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.పోటీల్లో వివిధ విభాగాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బెంచ్‌ప్రెస్‌, డెడ్‌లిఫ్ట్‌ విభాగాల్లో తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించారు. క్రీడాకారుల ప్రదర్శనలను తిలకించేందుకు యువత, క్రీడాభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది.పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఓవరాల్‌ విజేతకు రూ.4,999 నగదు బహుమతి అందజేశారు. విజేతలతో పాటు ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ముఖ్య అతిథులు, నిర్వాహకులు అభినందించారు. కార్యక్రమంలో విశిష్ట అతిధిగా 27వ డివిజన్‌ కార్పొరేటర్‌ కల్పే చిరంజీవి, నవీన్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ డాక్టర్‌ నవీన్‌ , విద్యుత్‌ శాఖ అధికారి బాబా శ్రీనివాస్‌, వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు పృథ్వీరాజ్, గణేష్ టెంపుల్ చైర్మన్ భూషణ్ చారి, మురళి కృష్ణ, బీసీ సాధికార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పసుల లక్ష్మణ్‌, మోహన్ గైక్వాడ్ తదితరులు పాల్గొన్నారు.

పోటీలకు విశేష స్పందన లభించడంపై డీఎస్‌ ఆర్నాల్డ్‌ జిమ్‌ నిర్వాహకుడు డిలోడ్‌ శేఖర్‌ హర్షం వ్యక్తం చేశారు. నగర యువతలో ఫిట్‌నెస్‌, క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా భవిష్యత్తులో మరిన్ని పోటీలు, కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5