రాకపోకలకు ఇబ్బందిగా మారిన చెట్ల కొమ్మల తొలగింపు
గ్రామంలో స్ట్రీట్ లైట్ల ఏర్పాటు.
S
By S KISHOR •September 20, 2026
13

మన ఇందూర్ భీంగల్ :
భీమ్‌గల్ మండలం జాగిర్యాల్ గ్రామంలో ప్రధాన రహదారికి ఇరువైపులా వాహనదారుల రాకపోకలకు ఇబ్బందిగా మారిన చెట్ల కొమ్మలను జెసిబి తో తొలగించినట్లు సర్పంచ్ గడల ప్రసాద్,ఉపసర్పంచ్ రాజేశ్వర్ తెలిపారు. ఆదివారం ఈ కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ వీడీసీ సభ్యుల ఆధ్వర్యంలో తొలగించినట్లు తెలిపారు.అనంతరం గ్రామంలో ప్రజలకు రాత్రివేళల్లో రాకపోకల్లో ఇబ్బందులు లేకుండా మెరుగైన వెలుతురు కొరకు పాడైపోయిన స్ట్రీట్ లైట్లను తొలగించి నూతన లైట్లను ఏర్పాటు చేశామన్నారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన పనులను దశలవారీగా చేపడుతున్నామని పాలకవర్గ సభ్యులు తెలిపారు.






