Mana Indur News
స్థానిక వార్తలు

ఉద్యోగస్తుల సమస్యల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి

డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.దాసు

KA
By KARKA RAMESH•September 24, 2026
5
Share
ఉద్యోగస్తుల సమస్యల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి

మన ఇందూర్ / నిజామాబాద్ :

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని లేనియెడల దశల వారి పోరాట కార్యక్రమాన్ని ప్రకటించి ఉద్యమిస్తామని డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.దాస్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వేల్పూర్ మండలంలో సభ్యత్వ నమోదులో భాగంగా వివిధ పాఠశాలలను పర్యటించి పాఠశాలల్లో ఏర్పాటైన సమావేశాలలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తన మానిఫెస్టోలో పేర్కొన్న సమస్యలలో ఒకటైన సిపిఎస్ రద్దు, మెరుగైన ఫిట్మెంట్తో పిఆర్ సి అమలు, క్రమం తప్పకుండా కరువు భత్యం విడుదల, పెండింగ్ బకాయిల చెల్లింపులు మొదలైన సమస్యలు పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చి రెండున్నరెండ్లు గడిచినా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో అనివార్యంగా టీజీఇ జెఎసి దశల వారి ఉద్యమ కార్యాచరణ ప్రకటించిందని మొదటి దశలో గత నెల 27న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో వేలాది మందితో ధర్నాల నిర్వహించామని రెండవ దశ చలో హైదరాబాద్ ఈనెల 10న నిర్వహించవలసి ఉండగా ఒక్కరోజు ముందు చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు ఉద్యోగ సంఘ నాయకులతో నాటకీయంగా చర్చలు జరిపి తక్షణమే పిఆర్సి కమిషన్ చైర్మన్ శివశంకర్ నుండి రిపోర్టు తెప్పిస్తామని, మిగతా డిమాండ్లు తక్షణ పరిష్కారం కొరకు హామీ పడిన దానికి కట్టుబడకపోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 13 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లను నమ్మించి మోసగించినట్లు అయిందని, చర్చల పేరిట మూడుసార్లు తేదీలు మారుస్తూ ప్రభుత్వం దోబూచులాడుతున్న వైఖరి సరైంది కాదని తక్షణమే ప్రభుత్వం హామీ పడిన సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పి. దాస్ డిమాండ్ చేశారు.

జిల్లా ఉపాధ్యక్షులు రాసరి పెంటన్న మాట్లాడుతూ దసరా సెలవులలో ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు చేపట్టాలని, బోధనకు ఆటంకం కలగకుండా వివిధ రకాల శిక్షణలను వేసవి సెలవులలోనే నిర్వహించాలని, పిఆర్ సి ని 51% ఫిట్మెంట్తో జూలై 2023 నుండి అమలు చేయాలని, సిపిఎస్ రద్దుకు అధ్యయన కమిటీకి నిర్దిష్ట గడువు రెండు మాసాలు విధించి పాత పెన్షన్ విధానాన్ని అమలుకు చర్యలు తీసుకోవాలని, 6 పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, పెండింగ్ బకాయిల కొరకు ప్రతినెల 2000 కోట్లు కేటాయించాలని, కేజీబీవీ ఉద్యోగుల సమ్మె కాలం వేతనం తక్షణమే చెల్లించాలని, వీరికి మినిమం టైమ్ స్కేలు వర్తింపజేయాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, 317 జీవో బాధితులకు 190 జీవో ద్వారా న్యాయం జరగలేదని బదిలీలు చేసి వారికి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈరోజు... జెడ్పిహెచ్ఎస్. మోతే , కుక్కునూర్, లక్కో ర పాఠశాలలో సభ్యత్వ నమోదు చేయించడం జరిగింది ఈరోజు పర్యటనలో జిల్లా అధ్యక్షులు బాలయ్య,జిల్లా కార్యదర్శి షేక్ మదర్, మండల నాయకులు గంగ నరసయ్య పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5