ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
డిచ్‌పల్లి సెవెంత్ బెటాలియన్‌లో కమాండెంట్ బి. సీతారాం
Pi
By Pilolla Raju •September 27, 2026
6

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
మన ఇందూర్ న్యూస్ / డిచ్ పల్లి:
డిచ్‌పల్లి సెవెంత్ బెటాలియన్‌లో కమాండెంట్ బి. సీతారాం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ బి. సీతారాం కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు స్వాతంత్ర్య ఉద్యమంలో బాపూజీ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలు, ప్రజాసేవను కొనియాడారు. కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు, సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.






