Mana Indur News
స్థానిక వార్తలు

మట్టి గణపతుల పంపిణీ

పట్టణంలోనీ శ్రీ నారాయణ హై స్కూల్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ

KA
By KARKA RAMESH•September 14, 2026
16
Share
మట్టి గణపతుల పంపిణీ

మన ఇందూర్/భీమ్‌గల్ రూరల్ : వినాయక చవితిని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా భీమ్‌గల్ పట్టణంలోనీ శ్రీ నారాయణ హై స్కూల్ ఆధ్వర్యంలో కరెస్పాండెంట్ ప్రసాద్ రావు మట్టి గణపతులను విద్యార్థులకు,ప్రజలకు ఉచితంగా అందజేశారు.మట్టి గణపతి నీటిలో సులభంగా కరిగిపోయి నీటిలో ఉండే జీవరాశులకు ఎలాంటి హాని జరగదని,పిఓపి గణపతి వద్దు మట్టి గణపతి ముందు అనే భావంతో 14 ఏళ్లుగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ,మట్టి గణపతిని పూజించాలని ఉచితంగా మట్టి గణపతులను అందిస్తున్నామని ప్రసాద్ రావు తెలిపారు.ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని కోరారు.కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన పాఠశాల బృందానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5