మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవి కాలం పొడగించాలి
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని కలసి వినతి పత్రం అందజేసిన గుమస్తా దడువాయి ముల్లె హమాలీ చాట యూనియన్ నాయకులు

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొనసాగుతున్న ముప్ప గంగారెడ్డి పదవి కాలం పొడగించాలని కోరుతూ వ్యవసాయ మార్కెట్ యార్డు గుమస్తా దడువాయి, ముల్లె హమాలీ, ఛాట యూనియన్ నాయకులు శుక్రవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డిని కలిశారు. ఈ మేరకు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసి మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్ పరిధిలో రైతు, కార్మికుల సంక్షేమం, అభివృద్ధి పట్ల ప్రస్తుత ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డికి అపారమైన అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయన సేవలను కొనసాగించాలని కోరారు. రైతులకు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరాలంటే ఆయన పదవి కాలం పొడగించాలని.. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే కు విన్నవించారు.ఈ కార్యక్రమంలో దాడువాయి ప్రెసిడెంట్ నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్, గుమస్తా సంఘం అధ్యక్షుడు బాల ఆంజనేయులు , సెక్రటరీ గట్ల శ్రీనివాస్, జాయిట్ సెక్రటరీ శివ కుమార్, చాట సంఘం అనసూయ గణేష్ ముల్లె సంఘం వెంకటి రాము తదితరులు పాల్గొన్నారు.






