భగత్ సింగ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి
ఎన్‌ఎస్‌యూఐ ఉపాధ్యక్షులు సయ్యద్ రెహమాన్

భగత్ సింగ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి
మన ఇందూర్ న్యూస్ /భీమ్‌గల్ రూరల్ : నిజామాబాద్ జిల్లా ఎన్‌ఎస్‌యూఐ ఉపాధ్యక్షులు సయ్యద్ రెహమాన్ ఆధ్వర్యంలో భీమ్‌గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.భగత్ సింగ్ ఆశయాలను నేటి యువత,విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సయ్యద్ రెహమాన్ పిలుపునిచ్చారు.దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన మహనీయుడు భగత్ సింగ్ ధైర్యం,దేశభక్తి, త్యాగం నేటి యువతకు, విద్యార్థులకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య,విజ్ఞానం, క్రీడలు,సామాజిక సేవపై దృష్టి సారించాలని సూచించారు.మత్తు పదార్థాల వల్ల ఆరోగ్యం, విద్య,కుటుంబ జీవితం, భవిష్యత్తు తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందన్నారు.భగత్ సింగ్ స్ఫూర్తితో చెడు వ్యసనాలకు దూరంగా ఉండి జీవిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.విద్యార్థులే దేశ భవిష్యత్తుకు సమాజంలో మంచి మార్పు తీసుకురావడంలో యువత కీలక పాత్ర పోషించాలన్నారు.“మత్తుకు దూరం..లక్ష్యానికి చేరువ” అనే నినాదంతో ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






