తాళ్ళ రాంపూర్ లో విడిసి వేధింపులు అవాస్తవం.
కుల, గ్రామ బహిష్కరణ అనేది వట్టిమాటలు..

తాళ్ళ రాంపూర్ లో విడిసి వేధింపులు అవాస్తవం.
కుల, గ్రామ బహిష్కరణ అనేది వట్టిమాటలు
మన ఇందూర్ న్యూస్ / నిజామాబాద్ అర్బన్
-మహిళలు అని చూడకుండా దాడులు చేస్తున్నారు
-తాళ్ల రాంపూర్ గ్రామస్తుల ఆవేదన
గౌడ కులస్తుల ఆరోపణపై సమగ్ర విచారణకు సిద్ధం..
మన ఇందూర్ న్యూస్ / నిజామాబాద్
తాళ్ల రాంపూర్ గ్రామంలో బీడీసీ అనేది లేదు. వీడిసి వేధింపులు అనే మాట అవాస్తవమని
గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల లబ్ధి కోసమే గౌడ కులస్తులు గ్రామస్తులపైన బహిష్కరణ పేరిట తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ..కుల బహిష్కరణ, గ్రామ బహిష్కరణ, సాంఘిక బహిష్కరణ అనేది వట్టిమాటేనని అసలు మా గ్రామంలో వీడిసి అనేది లేదన్నారు. గ్రామంలో గత రెండు సంవత్సరాల క్రితం తగాదాలు మొదలయ్యాయని, జిల్లా అధికారులు,పోలీసులు గ్రామానికి వచ్చి విచారణ చేపట్టి గొడవలు సద్దుమణిగెల చేశారన్నారు. తిరిగి ఇప్పుడు అదే రకమైన ఆరోపణలతో మళ్లీ తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు.ఇప్పటికి
గ్రామంలో జరిగే ఏ ఉత్సవమైన కలిసికట్టుగా చేసుకుంటామని గుర్తు చేశారు.వారి తప్పుడు ఫిర్యాదు మేరకు మహిళ అని చూడకుండా పోలీసులు విచక్షణరహితంగా దాడి చేశారని విచారం వ్యక్తం చేశారు. గౌడ కులస్తులు ఏది చెప్తే పోలీసులు అది చేస్తున్నారని,
మాకు అన్యాయం జరిగిందని ఫిర్యాదులు చేస్తే పట్టించుకోవడం లేదని ఆరోపించారు.కుల బహిష్కరణ,గ్రామ బహిష్కరణ అనేది వట్టిమాటేనని అసలు మా గ్రామంలో వీడిసి అనేది లేదన్నారు.. గ్రామస్థులు ఎవ్వరు కూడా గౌడ కులస్థులను డబ్బులు డిమాండ్ చేయలేదన్నారు. బహిష్కరణ చేశారని ఆరోపణలు చేస్తున్నవారు మా గ్రామంలో అన్ని రకాల పనులు చేసుకుంటూ అనవసరమైన ఆరోపణలు మాపైన రుద్ధుతూ తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు.రాజకీయ
లబ్ది కోసమే గ్రామంలో నిప్పు రాజేస్తున్నారన్నారు.మా పైన పెట్టిన తప్పుడు కేసులను తక్షణమె ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో క్యాదం దేవేందర్,, బావులు, గుండ్ల ఉషన్న, రాజారాం,శ్రీనివాస్,వడ్ల సుదర్శన్, తెనుగు సత్యనారాయణ, బాలకృష్ణ,లింబవ్వ,లక్ష్మి, లావణ్య, మంజుల,తదితరులు పాల్గొన్నారు.






