సాంఘిక బహిష్కరణ సరియైనది కాదు.
మండల గౌడ యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్
KA
By KARKA RAMESH•September 24, 2026
16

మన ఇందూర్/ సిరికొండ:
ఎర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామానికి చెందిన 49 మంది గౌడ కులస్తులను బహిష్కరించడం సరియైన పద్ధతి కాదని సిరికొండ మండల గౌడ యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామము అంటేనే వివిధ విభిన్న కుల వృత్తుల సమూహం అని అందరి కలసిమెలసి సామరస్యంగా ఉండాలలన్నారు. ఏదైన సమస్యలు ఉంటే పరిష్కరించాల్సిన అవసరం ఉందని కానీ అలాంటి గ్రామ అభివృద్ధి కమిటీయే ఇలా గ్రామంలో బహిష్కరణ చేయడం సరైన పద్ధతి కాదన్నారు.. ఉన్నత అధికారులు చొరవ తీసుకోనీ సమస్యను పరిష్కరించాలని సిరికొండ మండల గౌడ యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ కోరారు






