ప్రభుత్వ ఆసుపత్రిలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఏఐటియుసి డిమాండ్

ప్రభుత్వ ఆసుపత్రిలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఏఐటియుసి డిమాండ్
మన ఇందూర్ న్యూస్/ నిజామాబాద్:
ప్రభుత్వ ఆసుపత్రిలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య అన్నారు. శనివారం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిజిహెచ్ హాస్పిటల్ ముందు జరిగిన ధర్నాను ఉద్దేశించి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని ఆస్పత్రి సూపర్డెంట్, ప్రిన్సిపల్, డిఎంఈ, వైద్యశాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కి అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించిన ఫలితం లేకపోవడంతో ఈ నెల 12 నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్మికుల వేతన ఒప్పందం ముగిసి సంవత్సరం పూర్తవుతున్న నూతన టెండర్లు వేసి కార్మికుల సంఖ్యను, కార్మికుల వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని, వీటితోపాటు నిజామాబాద్ జిజిహెచ్ ను వెయ్యి పడకలకు పెంచాలని, కార్మికులకు జాతీయ పండుగ ఆర్థిక సెలవులు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈనెల 28 వరకు సమస్యలు పరిష్కరించినట్లయితే సమ్మె నిర్వహించక తప్పదని ప్రభుత్వానికి తెలుపుతున్నామన్నారు ఈ ధర్నా లో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పి.సుధాకర్, నాయకులు భాగ్యలక్ష్మి, స్వరూప, భారతి, పవిత్ర, కవిత, సాయి, శివ తదితరులు పాల్గొన్నారు.






