Mana Indur News
కల్చరల్

గణేష్ శోభాయాత్ర బందోబస్తులో ఎన్‌సీసీ క్యాడెట్ల సేవలు

ఎన్‌సీసీ క్యాడెట్లు క్రమశిక్షణ, అంకితభావం, బాధ్యతాయుతమైన సేవా భావంతో బందోబస్తు విధుల్లో

KA
By KARKA RAMESH•September 25, 2026
82
Share
గణేష్ శోభాయాత్ర బందోబస్తులో ఎన్‌సీసీ క్యాడెట్ల సేవలు

మన ఇందూర్ / నిజామాబాద్ అర్బన్:

నిజామాబాద్ నగరంలో శుక్రవారం నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఎన్.సి.సి.12 తెలంగాణ బెటాలియన్ కమాండర్ కల్నల్ ప్రియాజిత్ సూర్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖకు సహకరిస్తూ, నిజామాబాదులోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల, సి.ఎస్.ఐ. కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన ఎన్‌సీసీ క్యాడెట్లు, ఎన్‌సీసీ అధికారులు లెఫ్టినెంట్ డా. ఎం. రామస్వామి, కెప్టెన్ రాజేశ్వర్, నరేష్ బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. ఎన్‌సీసీ క్యాడెట్లు క్రమశిక్షణ, అంకితభావం, బాధ్యతాయుతమైన సేవా భావంతో బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. శోభాయాత్ర ప్రశాంతంగా, సురక్షితంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు పోలీస్ శాఖకు ఎన్‌సీసీ క్యాడెట్లు తమ సహకారాన్ని అందించారు. ఎన్‌సీసీ క్యాడెట్ల సేవలను పోలీస్ అధికారులు, సిపి. సాయి చైతన్య, ఏసిపి ప్రకాష్, తదితరులు అభినందించారు.

#Ncc క్యాడెట్లు.

#giriraj college

#csi college.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5