జాతీయస్థాయి బ్యాడ్మింటన్ క్రీడా పోటీలకు ఎంపికైన నిజామాబాద్ జిల్లా క్రీడాకారిణి గుగులోత్ స్వప్న..
45 నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలకు ఎంపికైన నిజామాబాద్ జిల్లా క్రీడాకారిణి గుగులోత్ స్వప్న..

45వ సబ్ జూనియర్ నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలకు ఎంపికైన నిజామాబాద్ జిల్లా క్రీడాకారిణి గుగులోత్ స్వప్న..
మన ఇందూర్ న్యూస్ నిజామాబాద్ అర్బన్
45వ సబ్ జూనియర్ నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారిణి గుగులోత్ స్వప్న ఎంపికైనట్లు నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షులు గడ్డం శ్రావణ్ రెడ్డి తెలిపారు.తెలంగాణ రాష్ట్ర బాల్ బ్యాట్మెంటన్ సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30వ తేదీ నుంచి 2వ తేదీ వరకు హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ మారుతి బాల్ బ్యాడ్మింటన్ గ్రౌండ్ లో బాల్ బ్యాడ్మింటన్ సబ్ జూనియర్ క్రీడాకారులకు సన్నదత శిబిరం నిర్వహించి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 04వ తేదీ నుండి 8వ తేదీ వరకు చత్తీస్గడ్ రాష్ట్రంలోనీ భిలాయ్ లో జరిగే 45 వ సబ్ జూనియర్ నేషనల్ బాల్ బ్యాట్మెంటన్ క్రీడా పోటీలకు పంపడం జరిగింది.నిజామాబాద్ జిల్లా క్రీడాకారిని గుగులోత్ స్వప్న తెలంగాణ జట్టుకు ఎంపిక కావటం జరిగింది. సబ్ జూనియర్ జాతీయ క్రీడా పోటీలకు ఎంపికైన క్రీడాకారిని గూగుల్ స్వప్న ను నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షులు గడ్డం శ్రావణ్ రెడ్డి, చైర్మన్ ప్రీమియర్ దేవేందర్ రెడ్డి, పాటర్న్ మానస గణేష్ ,ప్రధాన కార్యదర్శి బోనగిరి శ్యామ్, వర్కింగ్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ రెడ్డి, కోశాధికారి రాజేశ్వర్, ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, కాశిరెడ్డి సునీత , రాజేష్,నిర్వహణ కార్యదర్శి నాగేష్, నరేందర్,కామారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు .నర్సింగ్ రావు కృష్ణమూర్తి బాల్ బ్యాడ్మింటన్ సంఘం కార్యవర్గ సభ్యులు సురేష్, మాధురి, భాగ్యశ్రీ, ఆనంద్, కార్తీక్,సీనియర్ క్రీడాకారులు అభినందించారు.






