Mana Indur News
స్థానిక వార్తలు

శివాజీ మహరాజ్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

శ్రీ శివాజీ మహారాజ్ సేవా సమితి జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ శివాజీ పాటిల్

MI
By Mana Indur News•September 13, 2026
23
Share
శివాజీ మహరాజ్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

శివాజీ మహరాజ్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని శ్రీ శివాజీ మహారాజ్ సేవా సమితి జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ శివాజీ పాటిల్ అన్నారు.

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్:

చత్రపతి శివాజీ మహరాజ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లి సమాజానికి ఆదర్శంగా నిలువలని శ్రీ శివాజీ మహారాజ్ సేవా సమితి జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ శివాజీ పాటిల్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గీతా భవన్ కార్యాలయంలో ఆదివారం జిల్లా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మండల బాధ్యులు అందరూ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ మహారాజ్ ఆలోచనలను, ఆదర్శాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని, ఎక్కడైతే శివాజీ మహారాజ్ విగ్రహాలను ఏర్పాటు చేశారు ఆ కమిటీ అక్కడ పర్యవేక్షణ చేయాలని, అదేవిధంగా మండల స్థాయిలోని శివాజీ ఆలోచనలను, ప్రతి గ్రామీణ ప్రాంతంలోనూ ప్రతి గ్రామానికి శివాజీ మహరాజ్ ఆదర్శమైన ఆలోచనలను ముందుకు తీసుకువెళ్తూ... యువతని చెడు మార్గంలో వెళ్లకుండా సన్మార్గంలో వెళ్లేందుకు, వారికి ప్రతినెల సమావేశం ఏర్పాటు చేసుకొని, ప్రతి కుటుంబాన్ని సాంప్రదాయబద్ధంగా, ముందుకు తీసుకెళ్లేందుకు గ్రామీణ స్థాయి నుండి ప్రతి ఒక్కరు సన్నద్ధం కావాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ రవికుమార్, ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, రాజేశ్వర్, సెక్రెటరీ అంబదాసు , దిగంబర్ పాండ్రి, కృష్ణ పాటిల్, మండలాల నాయకులు జి రాజు, సుభాష్, సిరికొండ వెంకట్ రెడ్డి, రాజేష్, ప్రశాంత్ దుబ్బ, కొల్లపాకు రాజు గౌడ్, బి నవీన్ , అరుణ్ కుమార్, ప్రకాష్, శ్రీనివాస్, రాజయ్య రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5