Mana Indur News
స్థానిక వార్తలు

గణేష్ విగ్రహ ప్రతిష్టాపన నుంచి విమజ్జనం వరకు నిర్వాహణకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ .సాయి చైతన్య

KA
By KARKA RAMESH•September 27, 2026
2
Share
గణేష్ విగ్రహ ప్రతిష్టాపన నుంచి విమజ్జనం వరకు నిర్వాహణకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్

గణేష్ విగ్రహ ప్రతిష్టాపన నుంచి విమజ్జనం వరకు నిర్వాహణకు సహకరించిన ప్రతీ ఆఒక్కరికి కృతజ్ఞతలు: పోలీస్ కమిషనర్ వెల్లడి నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలో గణేష్ విగ్రహ ప్రతీష్టాపన నుండి నిమజ్జనం వరకు పండుగ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో ప్రజలందరూ జరుపుకోవడం జరిగింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలో 5811 గణేష్ విగ్రహాలు ప్రతిష్టించడం జరిగింది. ప్రతిష్టాపన అనంతరం భక్తులందరూ సాంప్రదాయం ప్రకారం 9 మరియు 11 రోజుల పాటు మండపాలలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి తదుపరి నిమజ్జనం చేయడం జరిగింది. దీనికి అన్ని మతాల ప్రజలు స్వచ్చందంగా సహకరించుకొని జయప్రదం చేయడం జరిగింది. నిమజ్జనం కోసం ప్రత్యేకంగా బాసర బ్రిడ్జి వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. బాసర , ఉమ్మెడ ఇవి కాకుండా మిగితా చాలా ప్రదేశాలలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి వేడుకలు ప్రశాంత వాతావరణంలో గణేష్ విగ్రహాల ప్రతీష్టాపన మరియు నిమజ్జనం వేడుకలు అన్నింటికి సార్వజనిక్ గణేష్ మండలి , విగ్రహ గణేష్ కమిటీలు , మజీద్ కమిటీలు, మరియు అన్నిమతాల ప్రజలు , ప్రతీ ఒక్కరు పోలీస్ శాఖకు సహకరించడం జరిగింది. అదే విధంగా వివిధ శాఖల అధికారులు / సిబ్బంది ప్రత్యేకంగా రెవెన్యూ శాఖ, గ్రామ పంచాయతి మున్సిపాలటి , అబ్కారీ శాఖ, ఫైర్ సర్వీస్ మరియు ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్, గజ ఈతగాళ్లు అందరూ వారి సేవలను అందించడం జరిగింది. పత్రిక ప్రతినిధులు ఎలక్ట్రానిక్ మీడియా / ప్రింట్ మీడియా సిబ్బంది అందరూ కూడా సహకరించడం జరిగింది. ఈ శుభ సందర్బంలో ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలవడం జరిగింది.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5