Mana Indur News
కల్చరల్

మట్టి వినాయకుడిని పూజించడమే మనకి ప్రకృతికి శ్రేయస్కరం

- ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం అధ్యక్షులు రామానంద రాయ్ గౌరదాస్

KA
By KARKA RAMESH•September 22, 2026
17
Share
మట్టి వినాయకుడిని పూజించడమే మనకి ప్రకృతికి శ్రేయస్కరం

మన ఇందూర్ /నిజామాబాద్ అర్బన్:

వినాయక నవరాత్రులలో భాగంగా మట్టి వినాయక ప్రతిమను ప్రతిష్టించడమే కాకుండా 1500 భగవద్గీతలతో స్వామివారి రూపాన్ని తీర్చిదిద్ది సందేశాత్మకంగా వినాయక నవరాత్రులను నిర్వహిస్తున్న రవీంద్ర గణేష్ మండలి వారిని ఇస్కాన్ కంటేశ్వర్ కేంద్రం అధ్యక్షులు రామానంద రాయి నేతృత్వంలోని బృందం వారి గణపతి మండపానికి వెళ్లి కలవడం జరిగింది. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి ఒక వినూత్నమైన ఆలోచనతో భగవద్గీతలను ప్రచారంలోకి తీసుకువచ్చిన కమిటీ అధ్యక్షుడు సుభాష్ గారిని ఇస్కాన్ తరపున సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా రామానంద రాయి మాట్లాడుతూ మట్టి వినాయకుడిని పూజించడమే శాస్త్రపరంగా సరైనదని మరియు ఆ పద్ధతిలో పూజించడం ద్వారానే భగవంతుడు అనుగ్రహం లభిస్తుందని పర్యావరణానికి హాని చేసే రంగులు మరియు కెమికల్స్ తో తయారైన విగ్రహాలను తయారు చేసి నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా ప్రకృతికి జరిగే నష్టానికి మనం కారణమవుతున్నామని అలాంటి అనాగరిక పద్ధతుల నుంచి సమాజాన్ని మంచి మార్గంలో నడిపించాలని ఆ దిశగా 9 సంవత్సరాల నుంచి ఒక ఆదర్శవంతమైన పద్ధతిలో మట్టి వినాయకుడిని తయారుచేసి పూజిస్తున్న బురుడు గల్లి శ్రీ రవీంద్ర గణేష్ మండలి వారు ఎంతో ధన్యులని ఆయన పేర్కొన్నారు. ఇదే ఆదర్శాన్ని అందరూ ప్రజలు స్వీకరించి భవిష్యత్తులో మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని తద్వారా ప్రకృతికి పర్యావరణానికి మంచి చేయాలని వారు సూచించారు. భగవద్గీత లను ప్రతి మనిషి చదవాలని ఆచరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాదాసు స్వామి యాదవ్, రవి యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5