Mana Indur News
స్థానిక వార్తలు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, నిజామాబాద్ ఎన్నికల్లో గెలిపించండి

రెడ్ క్రాస్ ద్వారా సేవ చేసే మరో అవకాశం ఇవ్వాలి.. నరాల సుధాకర్..

MI
By Mana Indur News•September 30, 2026
23
Share
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, నిజామాబాద్ ఎన్నికల్లో గెలిపించండి

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, నిజామాబాద్ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను.

ఇందూర్ బ్లడ్ డోనర్స్ గ్రూపును 11 సంవత్సరాల కిందట స్థాపించి అర్ధరాత్రి, అపరాత్రి అని చూడకుండా వేలమందికి రక్తదానం చేయించి వారి కష్ట సమయంలో అండగా ఉండే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు

ఇప్పుడు రెడ్ క్రాస్ మహాశయ సభ్యులు నాకు రెడ్ క్రాస్ ద్వారా సేవ చేసే మరో అవకాశం ఇవ్వాలని విన్నపం చేసుకుంటున్నాను.

ప్రస్తుత రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు సార్ గారి పానెల్ లోని మొత్తం 14 మందికి ఓట్లు వేయాలని మనవి

మా ప్యానెల్ లో ఉన్నందరికి గత కొన్ని సంవత్సరాలుగా రెడ్ క్రాస్ తో అనుబంధం ఉంది. మా రక్తదాన సేవలకు గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ మరియు జిల్లా యంత్రాంగం చేతుల మీదుగా అవార్డులు అందుకున్న ఈ ప్యానల్ సభ్యులకు నిజామాబాద్ ప్రజలకు సేవ చేసే భాగ్యం మరొకసారి కల్పించాలని మనవి.

బ్యాలెట్ పేపర్ లో నా సీరియల్ నంబర్: -28

బుస్సా అంజనేయులు సార్ ప్యానల్ లోని మొత్తం 14 మంది యొక్క బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబర్స్ (1, 2, 3, 5, 7, 9, 11, 13, 16, 17, 21, 22, 27, 28)

*పోలింగ్ తేదీ: 04/10/2026* సమయం:- ఉదయం 08:00 to 03:00.pm వరకు

పోలింగ్ కేంద్రం: హరిచరణ్ స్కూల్, బస్‌స్టాండ్ సమీపంలో, నిజామాబాద్. రక్తదానం – ప్రాణదానం సేవే సమాజానికి బలం

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5