కేర్ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర ప్రయోగ ప్రదర్శన కార్యక్రమం
జంతు శాస్త్ర ప్రయోగ ప్రదర్శన కార్యక్రమం

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్
కేర్ డిగ్రీ కళాశాలలో బీ జెడ్ సి చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల చేత కళాశాల జంతుశాస్త్ర అధ్యాపకులు కుమారి ఆస్మ ఆధ్వర్యంలో జంతు శాస్త్ర ప్రయోగ ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బన్సల్ కళాశాల డైరెక్టర్ మేకల లక్ష్మణ్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగిందని కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ తెలిపారు. విద్యార్థులు దాదాపు 15 రోజులుగా జంతుశాస్త్ర విషయ పరిజ్ఞాన మాడల్స్ ని స్వయంగా తమ స్వహస్తాలతో తయారుచేసి ప్రదర్శించడం జరిగిందని కళాశాల డైరెక్టర్ నరాలు సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగ ముఖ్య అతిథి మేకల లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఇటువంటి ప్రయోగ ప్రదర్శన కార్యక్రమాలు విద్యార్థుల్లో నిగూఢమైన మేధా శక్తిని బయటకు తీస్తదని అన్నారు. విద్యార్థులకు కేవలం చదవడంతో పాటు ఐటువంటి ప్రయోగపూర్వకమైన కార్యక్రమాలు చేపడితే జీవితాంతం వారికి ఆ విషయం జ్ఞాపకం ఉంటుందని అన్నారు. ఇటువంటి కార్యక్రమంలో తమను భాగస్వామి చేసినందుకు ధన్యవాదాలు అని మేకల లక్ష్మణ్ గారు అన్నారుం. ఈ ప్రదర్శన కార్యక్రమంలో నిజామాబాద్ నగరంలోని వివిధ జూనియర్ కళాశాలల విద్యార్థులను ఆహ్వానించి వారికి జంతుశాస్త్ర విషయ పరిజ్ఞానం పైన అవగాహన కల్పించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ గోరంట్యాల నరేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి విద్యావేత్త మేకల లక్ష్మణ్ తో పాటు కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్, ప్రిన్సిపల్ నరేష్, కళాశాల బాధ్యులు శంకర్ సందేశ్ మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు






