Mana Indur News
స్థానిక వార్తలు

బిఎస్ఎన్ఎల్ లాభనష్టాలకి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి

బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు పెన్షనర్స్ కు వెంటనే పే రివిజన్, పెన్షన్ రివిజన్ వెంటనే చేయాలి

KA
By KARKA RAMESH•September 19, 2026
1
Share
బిఎస్ఎన్ఎల్ లాభనష్టాలకి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్
బిఎస్ఎన్ఎల్ లాభనష్టాలకి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు. నేషనల్ కోఆర్డినేషన్ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఫోరమ్ ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఇచ్చిన  దేశవ్యాప్త మూడురోజుల
ధర్నా కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు శనివారం
బిఎస్ఎన్ఎల్ సంచార్భవన్ గాంధీ చౌక్ లో ధర్నా నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎనిమిదవ వేతన సవరణ సంఘం టర్మ్స్ ఆఫ్ రికార్డ్స్ లో పెన్షనర్లకు పెన్షన్ రివిజన్ లేకపోవడాన్ని అలాగే పెన్షన్ కమ్యూనికేషన్ 10 సంవత్సరాల 8 నెలలకే చెల్లించాలని ఆలిండియా పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు.  EVL నారాయణ మాట్లాడుతూ.. బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు పెన్షనర్లకు 2017 జనవరి నుంచి అమలు కావలసిన పే రివిజన్ పెన్షన్ రివిజన్ ఇంతవరకు అమలు చేయకపోవటాన్ని తీవ్రంగా ఖండిస్తూ, బిఎస్ఎన్ఎల్ లాభనష్టాలకి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ,ప్రభుత్వ విధానాల వల్లే బిఎస్ఎన్ఎల్ నష్టాల్లోకి వెళ్లిందని ,బిఎస్ఎన్ఎల్ కి అవసరమైన సమయంలో ఆధునిక సాంకేతిక పరికరాలను  అందించడంలో కేంద్ర ప్రభుత్వాలు విఫలమైనందువలనే మొబైల్ ,డేటా రంగంలో వెనుకబడిపోయిందని అందువల్లనే ప్రజలకు నాణ్యమైన 4 G  5 G, సర్వీసులు అందించలేకపోయిందని,అదే ప్రైవేటు ఆపరేటర్లకు ఆధునిక సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేసుకోవడంలో ప్రభుత్వాలు సహకరించినందున ప్రైవేట్ ఆపరేటర్లు లాభాల బాటలో ఉన్నారని, అందువల్ల బిఎస్ఎన్ఎల్ కు వచ్చిన నష్టాలను కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించి 20 సంవత్సరాలుగా  పే రివిజన్,పెన్షన్ రివిజన్ లేకుండా ఉన్న బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు  పెన్షనర్స్ కు వెంటనే పే రివిజన్, పెన్షన్ రివిజన్ వెంటనే చేయాలని  డిమాండ్ చేశారు.
*సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు హాజరై ధర్నా శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ* కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని ధ్వంసం చేస్తూ ప్రైవేట్ వారికి కారు చౌకగా అమ్మివేస్తూ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ ఉండటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
   దీనికి కారణం చట్టసభల్లో ఉద్యోగులు పెన్షనర్ల తరఫున ప్రజల తరఫున ప్రశ్నించే వాళ్ళు లేకపోవటమే కారణమని రానున్న ఎన్నికల్లో ప్రజల సమస్యలపై పోరాటాలు చేసే వారిని చట్టసభలకు పంపాలని కోరారు. 19 సెప్టెంబర్  1968 సమ్మెలో పాల్గొని అనేక కష్టనష్టాలను అనుభవించిన పోస్టల్ మరియు ఆర్ఎంఎస్ లో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులను సన్మానించడం జరిగింది. ఈ ధర్నాలో మధుసూదన్ ,బాల దుర్గయ్య ,సాయిలు, సాయన్న, నారాయణరెడ్డి, రైజుద్దీన్, అనురాధ మొదలైన రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5