Mana Indur News
స్థానిక వార్తలు

ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యం లో క్యాంపస్ పరిశుభ్రత

తెలంగాణ యూనివర్సిటీ లో క్యాంపస్ పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు

Pi
By Pilolla Raju •October 1, 2026
3
Share
ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యం లో క్యాంపస్ పరిశుభ్రత

ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యం లో క్యాంపస్ పరిశుభ్రత

మన ఇందూర్ న్యూస్/ డిచ్పల్లి

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ యూనివర్సిటీ జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్ ) యూనిట్–III ఆధ్వర్యంలో NSS ప్రోగ్రాము ఆఫీసర్ డా. ఎన్. స్వామి పర్యవేక్షణలో గురువారం తెలంగాణ యూనివర్సిటీ లో క్యాంపస్ పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని హాస్టల్ పరిసరాల్లోని పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం, ఎండిన ఆకులను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రమైన క్యాంపస్‌పై అవగాహన కల్పించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్. యన్. స్వామి పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ చూపిన స్వచ్ఛత మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని, పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని అన్నారు. విద్యార్థులు స్వచ్ఛత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొని “స్వచ్ఛమైన క్యాంపస్ – పచ్చని క్యాంపస్” నిర్మాణానికి తమ వంతు సేవను అందించారని ఆయన పేర్కొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5