Mana Indur News
స్థానిక వార్తలు

వెయ్యి రోజుల కాంగ్రెస్ పరిపాలనలో విద్యా రంగం కుదేలు

SFI రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు  రజినీకాంత్ రాష్ట్ర ప్రభుత్వం పై ధ్వజం

MI
By Mana Indur News•September 20, 2026
26
Share
వెయ్యి రోజుల కాంగ్రెస్ పరిపాలనలో విద్యా రంగం కుదేలు

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్

కాంగ్రెస్ వెయ్యి రోజుల పరిపాలనలో విద్యా రంగం కుదేలు అయిందని ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు  రజినీకాంత్ రాష్ట్ర ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. ఆదివారం
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కమిటీ సమావేశం నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నాందేవ్ వాడ జిల్లా కార్యాలయం లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు రజినీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పరిపాలనలో విద్యా రంగం కుదేలు అయ్యిందన్నారు. అదే విధంగా ప్రభుత్వం పెండింగ్ పాత బకాయిలను 5వేల కోట్లను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిన్న పాలిటెక్నిక్ విద్యార్థులతో హై లెవెల్ కమిటీ సమావేశంలో విద్యార్థులను కేకే కమిటీ సభ్యులు దుర్భశలాడడం సరికాదన్నారు.  వెంటనే క్షమాపణ చెప్పాలని ఫైర్ అయ్యారు. అదే విధంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ పై అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు అని హితవు పలికారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలను ఇవ్వకుండా ప్రైవేట్ విద్యా సంస్థలను ఇబ్బందీ చేయకూడదాని అని అన్నారు. వెంటనే యూనివర్సిటీ లకు నిధులను పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్, జిల్లా అధ్యక్షులు దీపికా, జిల్లా సహాయ కార్యదర్శి చక్రీ, రాజు,  గోవింద్, ఆదిత్య, విశాల్ , యశ్వంత్, రాహుల్, వేణు, వరప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5