Mana Indur News
క్రీడలు

విలువిద్యలో రాష్ట్రస్థాయిలో సత్తా చాటడం గ్రామానికి గర్వకారణం

క్రీడల్లో ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందిస్తున్నాం.

KA
By KARKA RAMESH•November 8, 2026
44
Share
విలువిద్యలో రాష్ట్రస్థాయిలో సత్తా చాటడం గ్రామానికి గర్వకారణం

విలువిద్యలో రాష్ట్రస్థాయిలో సత్తా చాటడం గ్రామానికి గర్వకారణం

క్రీడల్లో ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందిస్తున్నాం.

మన ఇందూర్ న్యూస్/ధర్పల్లి:

రాష్ట్ర స్థాయి విలువిద్య పోటీల్లో సత్తా చాటి గ్రామానికి గర్వ కారణంగా నిలవడం గొప్ప విషయం గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ ప్రశాంత్, గ్రామ వార్డు సభ్యులు రాఘవేందర్ అన్నారు. ఆదివారం ధర్పల్లి మండలం హాన్నాజీపేట్ గ్రామంలో విడిసి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి విలువిద్య పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన దీక్షిత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడల్లో ప్రోత్సహించిన తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో రావడం అంటే మామూలు విషయం కాదని, ఎంతో శ్రమించాల్సి ఉంటుంది అని, వ్యయ ప్రయాసలకు ఓర్చి గెలవడం అభినందించదగ్గ విషయం అన్నారు. ఈ సందర్భంగా దీక్షిత్ రెడ్డిని క్రీడల్లో ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులు సంధ్య -గోవింద్ రెడ్డి లకు అభినందనలు తెలిపారు. సన్మాన కార్యక్రమంలో వీడిసి అధ్యక్షులు ప్రశాంత్, రాఘవేందర్, గోపి, సుభాష్ రెడ్డి, సుదర్శన్, బుచ్చన్న, శ్రీనివాస్ రెడ్డి, రఘుపతి, గోవర్ధన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5