జి.జి. కళాశాలలో " మహాకవి గురజాడ జయంతి" కార్యక్రమం.
"సాహిత్య అధ్యయనం మానవత్వాన్ని మేల్కొల్పుతుంది - ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి.రామ్మోహన్ రెడ్డి

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్ :
గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల, కొరవి గోపరాజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో సోమవారం "మహాకవి గురజాడ జయంతి" కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ "సాహిత్య అధ్యయనం మానవత్వాన్ని మేల్కొల్పుతుందని, మన మాతృభాషతెలుగును, తెలుగు కవుల కృషిని మరవకూడదన్నారు. తెలుగు విభాగం అధిపతి లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి మాట్లాడుతూ....సమాజాన్ని సాహిత్యం ద్వారా సంస్కరించిన మహనీయుడు, భాషను, ఛందస్సును, సరళతరం చేసిన మహా కవి గురజాడ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్ రంగరత్నం, తెలుగు విభాగాధిపతి లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి, టీయూ ఈసి మెంబర్ డాక్టర్ దండుస్వామి, తెలుగు అధ్యాపకులు ఆర్. రాజేశ్వర్, కె.గంగాధర్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శమంత, రాధిక, అర్చన, సుభాషిని దేవి, తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






