Mana Indur News
స్థానిక వార్తలు

సహారా బాధితులను ఆదుకోవాలి

బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకుల సహారా ఏజెంట్స్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

Sa
By Santhosh dharpally •September 13, 2026
17
Share
సహారా బాధితులను ఆదుకోవాలి

మన ఇందూర్ ధర్పల్లి:

సహారా బాధితులను ఆదుకోవాలని బాలయ్య కోరారు. ఆదివారం ధర్పల్లి మండల కేంద్రంలో రూ.13కోట్ల సహారా బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకుల, సహారా ఏజెంట్స్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సహారా బాధితులకు వెంటనే న్యాయం చేయాలని కోరారు. సహారా కంపెనీకి చెందిన ఆస్తులను జప్తు చేసి, బాధితులకు వారి డబ్బులను తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మిట్టపల్లి గంగారెడ్డి, చెలిమెల నర్సయ్య, లోలం గంగారెడ్డి, ఎల్లయ్య, కిషన్, లక్ష్మీ నర్సయ్య, మహిపాల్, సురేష్, అనిల్ పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5