Mana Indur News
స్థానిక వార్తలు

NCSF సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీనీ తెరిపించి బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నడిపించాలి

ట్రాక్టర్ లతో భారీ ర్యాలీ చెరుకు ఉత్పత్తి  దారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య

KA
By KARKA RAMESH•September 24, 2026
3
Share
NCSF సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీనీ తెరిపించి బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నడిపించాలి

మన ఇందూర్ /నిజామాబాద్ అర్బన్:
మూతపడిన NCSF సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించి బెల్లం కేంద్రం మార్చి ప్రభుత్వమే నడిపించాలని ట్రాక్టర్ లతో MRO ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం మోపాల్ తహసీల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా చెరుకు ఉత్పత్తి దారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య, దుపల్లి లక్ష్మా రెడ్డి, తాడేం రాజారెడ్డి, పోచారం సంతోష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఒకనాడు మంచి లాభాలతో నడిచిన NCSF సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ వల్ల రైతులు అనేక లాభాలు గడించారాని వారి పిల్లల చదువులు,ఇండ్లు కట్టుకోవడం,పెళ్లిలు తదితర అనేక ఆర్థిక అభివృద్ధికి   ఈ ఫ్యాక్టరీ తోడ్పడిందని వారన్నారు.కేంద్ర ప్రభుత్వం చక్కెర పాలసీలతో పాటు అవినీతి అధికారుల మూలంగా నష్టాల్లో కురుకపోయిందని, మూత పడిందని ఈ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించే బాధ్యత మీ మీదనే,రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీదనే ఉందని వారు కోరారు. ఈ ప్రాంతంలో 80 గ్రామాలలో రైతులందరూ చెరుకు పండించేందుకు ముందుకు వస్తున్నారని ప్రభుత్వం రైతుకు లాభసాటి ధర చెల్లిస్తామని, విత్తనము ఉచితంగా ఇస్తామని రైతులను ప్రోత్సహించవలసిన బాధ్యత మీ మీదనే ఉందని వారన్నారు.
      ఆ రోజుల్లో బంగారం ధర 100 రూపాయలు ఉండే ఇప్పుడు 1,50,000ఉంది అప్పుడు ఫ్యాక్టరికోసం రైతులు 100 సభ్యత్వం చెల్లించారాని పెద్ద మొత్తం రైతులు సభ్యత్వం ద్వారానే ఫ్యాక్టరీ ఏర్పాటాయిందని వరన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ MLC బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రభుత్వ సలహా దారులు సుదర్శన్ రెడ్డి గారు, రూరల్ MLA భూపతి రెడ్డి గారు ఫ్యాక్టరీ విషయం లొ సానుకూలంగా ఉన్నారు వీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతామణి అన్నారని వరన్నారు.ఏలినివో ప్రభావం ఉంది కావున ప్రభుత్వం అరుతడి పంటలవైపు వెళ్లాలని చెప్పుతుంది కావున అరుతడిగా చెరుకు పంట వేసుకోవాలని అన్నారు. ఇప్పుడు బెల్లనికి మంచి డిమాండ్ ఉంది కావున సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరిని బెల్లం కేంద్రం గ మర్చి 100 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలొ కొట్టె గంగాధర్ మున్నూరు కాపు సంఘం జిల్లా కార్యదర్శి, అగ్గు చిన్నయ్య FPO చైర్మన్, గంగాధర్, K జనార్దన రెడ్డి,సాయినాథ్ 30 రైతులు పాల్గొన్నారు

#ncsf చెరుకు..

#ఆకుల పాపయ్య..

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5