Mana Indur News
స్థానిక వార్తలు

తె. యూ లో ఘనంగా NSS - DAY వేడుకలు

సేవ ద్వారా విద్య” అనే భావన, మూల స్ఫూర్తి

Pi
By Pillolla Raju •September 24, 2026
5
Share
తె. యూ  లో  ఘనంగా NSS - DAY వేడుకలు

మన ఇందూర్ / డిచ్ పల్లి:

తెలంగాణ యూనివర్సిటీలో జాతీయ సేవా పథకం (NSS) ఆధ్వర్యంలో NSS డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథి గా హాజరైన

వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1969 సెప్టెంబర్ 24న NSS ప్రారంభమైందన్నారు. సేవ ద్వారా విద్య” అనే భావన, మూల స్ఫూర్తి అని అన్నారు. విద్యార్థులు తరగతి గదిలో పొందిన జ్ఞానాన్ని సమాజ సేవకు అన్వయించాలని ఆయన సూచించారు. NSS ద్వారా యువతలో సేవా భావం, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధిలో యువత చురుకైన పాత్ర పోషించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.NSS ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కె. అపర్ణ మాట్లాడుతూ “Not Me But You” అనే NSS నినాదం సేవా స్ఫూర్తికి ప్రతీక అని తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో NSS యూనిట్లు నిర్వహించిన సామాజిక, పర్యావరణ, ఆరోగ్య, పరిశుభ్రత, రక్తదానం, యోగా, గ్రామీణ అవగాహన, ప్రత్యేక శిబిరాల కార్యక్రమాలను వివరించారు.

ప్రొఫెసర్ Ch. ఆరతి, ప్రొఫెసర్ జి. రాంబాబు, జిల్లా యువజన అధికారి బి. రమేష్ విద్యార్థులకు NSS లక్ష్యాలు, సానుభూతి, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవ మరియు యువత బాధ్యతలపై సందేశాలు అందించారు.

ఈ సందర్భంగా విద్యావేత్త, మెమరీ ట్రైనర్ ఆందే జీవన్‌రావు ఆధ్వర్యంలో సూపర్ బ్రెయిన్ యోగా అవగాహన, ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులకు ఏకాగ్రత, శారీరక దృఢత్వం, మానసిక చైతన్యం, ఆరోగ్యకరమైన జీవన విధానంపై ఆయన అవగాహన కల్పించారు.

NSS డే వేడుకల్లో భాగంగా యూనివర్సిటీలోని ఆరు NSS యూనిట్ల వాలంటీర్లకు వివిధ క్రీడా, సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ కనబరిచినందుకు బహుమతులు, షీల్డులు అందజేశారు. వాలీబాల్, క్యారమ్, చెస్, బ్యాడ్మింటన్, డ్యాన్స్, మోనో యాక్షన్, స్ట్రీట్ ప్లే, వక్తృత్వం తదితర పోటీల విజేతలను సత్కరించారు.

కార్యక్రమంలో డా. ఎం.బి. బ్రహ్మరాంబిక, డా. అహ్మద్ అబ్దుల్ హలీమ్ ఖాన్, డా. చ. శ్రీనివాస్, డా. ఎన్. స్వామి, డా. చ. నరసయ్య, డా. కె. గంగాధర్, డా. డి. శ్రీనివాస్, డా. వి. జలంధర్, డా. నేతా, ఫిజికల్ డైరెక్టర్, డా. కిరణ్ రాథోడ్ తదితర NSS ప్రోగ్రామ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5