Mana Indur News
రాజకీయం

బీ ఆర్ ఎస్ హయంలో 60 శాతం అర్ ఓ బి కి నిధులు విడుదల

మాధవనగర్ ఆర్వోబీ వద్ద మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటానికి పాలాభిషేకం

MI
By Mana Indur News•November 6, 2026
34
Share
బీ ఆర్ ఎస్ హయంలో  60 శాతం అర్ ఓ బి కి నిధులు విడుదల

మాధవనగర్ ఆర్వోబీ వద్ద మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటానికి పాలాభిషేకం

బీ ఆర్ ఎస్ హయంలో 60 శాతం అర్ ఓ బి కి నిధులు విడుదల

మన ఇందూర్ న్యూస్/ నిజామాబాద్ రూరల్

బీ ఆర్ ఎస్ హయంలోనే ఆర్ ఓ బి కి 60శాతం
నిధులు విడుదల చేయడం హర్షణీయం అన్నారు. గురువారం
నిజామాబాద్
నగర శివారులోని మాధవనగర్ ఆర్వోబీ వద్ద రూరల్ నియోజకవర్గ మాజీ ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గురువారం రూరల్ బీఆర్ఎస్ ఇంచార్జీ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బాజిడ్డి జగన్  ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్మోహన్ మాట్లాడుతూ.. 2015--16లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రైల్వే ఓవర్ వంతెన కోసం 60శాతం నిధులు మంజూరయ్యాయన్నారు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అప్పటి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిధుల సమీకరణలో తీవ్రంగా కృషి చేసి సాధించారన్నారు. అప్పటి ఎంపీ కవిత హయాంలో ఈ నిధులు వచ్చాయన్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ ఆర్వోబీని తామే సాధించాయని గొప్పలు చెప్పుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారన్నారు. ఆర్వోబీకీ బీజం పడిందే బీఆర్ఎస్ హయాంలో అని గుర్తు చేశారు. ఇన్ని ఏండ్లు గడిచిన పనులు నత్తనడకన సాగుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు తప్ప నిధులు తీసుకురావడంలో విఫలం అయ్యారని అన్నారు. ఇప్పటికైనా చిత్త శుద్ధి ఉంటే కాంగ్రెస్ నాయకులు పనులు పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు బాజిరెడ్డి రమాకాంత్, తిర్మల్ పటేల్, పద్మారావు, కోర్వ దేవేందర్, అజయ్, మల్లెపూల నరసింహ చారీ, రంగా, బంటు దాస్, ఖానాపూర్ హరి, బట్టు సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5