పిప్రి లో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన

ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
మన ఇందూర్ న్యూస్/భీమ్గల్ రూరల్:
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా భీమ్గల్ మండలం పిప్రి గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్లు, అలాగే ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇందిరమ్మ జీవిత బీమా పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. గుడిసెలు లేని గ్రామంగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని, గ్రామంలోని ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇల్లు, జీవిత బీమా అందేలా అందరి సహకారంతో కృషి చేస్తామని సర్పంచ్ అరిగెల జనార్ధన్ పేర్కొన్నారు. ఈ పథకాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరిగెల జనార్ధన్, ఉప సర్పంచ్ జేమ్స్ జితేందర్, గ్రామ కార్యదర్శి, కారోబార్ ముత్యాల, వీడీసీ సభ్యులు పల్లె శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు దుర్గి బాలగౌడ్, మాజీ సర్పంచ్ రాజేందర్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు రాజేష్, విగ్నేష్ తో పాటు పలువురు ఇందిరమ్మ పథకాల లబ్ధిదారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






